
Vijay Deverakonda’s Kingdom release date:
విజయ్ దేవరకొండ “కింగ్‌డమ్” సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ యాక్షన్ డ్రామా సినిమాను ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తున్నాడు. హీరోయిన్‌గా భవ్యశ్రీ బోర్స్ తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తోంది. మెగా ప్రొడక్షన్ హౌస్‌లు సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ కలిసి ఈ సినిమాను భారీగా నిర్మిస్తున్నాయి.
ఇటీవల “హృదయం లోపల” అనే ఫస్ట్ సింగిల్ విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అనిరుధ్ రవిచందర్ అందించిన మ్యూజిక్ చాలా రిచ్‌గా, డీప్‌గా ఉందని అందరూ అంటున్నారు. ఆ పాటతో సినిమాపై మరింత హైప్ పెరిగిపోయింది. దాంతో ఈ సమ్మర్‌లో అత్యంత ఎదురుచూసే సినిమాల్లో ఒకటిగా “కింగ్‌డమ్” నిలిచింది.
ఇంతలో కొన్ని రూమర్లు వచ్చాయి – మే 30, 2025న రిలీజ్ అవ్వదని, పోస్ట్‌పోన్ అయ్యిందని. అయితే ఇవన్నీ కట్ చేస్తూ, విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఆ పోస్టర్‌లో మే 30నే రిలీజ్ డేట్‌ని కన్ఫర్మ్ చేశారు. అంటే కింగ్‌డమ్ సినిమాకు ఎలాంటి డిలే లేదు… అన్నీ ప్లాన్ ప్రకారమే నడుస్తున్నాయి.
ఈ కొత్త పోస్టర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ జంప్ అయిపోయారు. విజయ్ లుక్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. యాక్షన్, ఎమోషన్స్, లవ్… అన్నీ మిక్స్ అయిన ఫీల్ గివ్వుతుంది. మల్టీ లాంగ్వేజ్‌లో రిలీజ్ అవుతున్న కింగ్‌డమ్ సినిమా ప్రోమోషన్స్ కూడా త్వరలో ఫుల్ స్వింగ్‌లో స్టార్ట్ కాబోతున్నాయి
ALSO READ: Mahabharata సినిమాలో కృష్ణుడి పాత్రలో Aamir Khan ఫిక్స్ అయినట్టేనా?












