HomeTelugu TrendingMahabharata సినిమాలో కృష్ణుడి పాత్రలో Aamir Khan ఫిక్స్ అయినట్టేనా?

Mahabharata సినిమాలో కృష్ణుడి పాత్రలో Aamir Khan ఫిక్స్ అయినట్టేనా?

Aamir Khan as Lord Krishna? Mahabharata Dream Project Update!
Aamir Khan as Lord Krishna? Mahabharata Dream Project Update!

Aamir Khan in Mahabharata Movie:

బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్, కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాల్లోకి గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆయన నటించిన ‘సితారే జమీన్ పర్’ సినిమా 2025 జూన్ 20న థియేటర్లలోకి రానుంది. అయితే ఫ్యాన్స్ మధ్యలో మరొక టాపిక్‌తో ఎక్కువగా చర్చలో ఉన్నారు – ఆమిర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ ‘మహాభారతం’ గురించి!

ఇటీవలి India సమ్మిట్లో పాల్గొన్న ఆమిర్ మాట్లాడుతూ, “మహాభారతం నా కల. కానీ అది చాలా కష్టమైన కల. మహాభారతం ఎప్పుడూ మిమ్మల్ని మోసం చేయదు, కానీ మనం దానిని మోసం చేసే ప్రమాదం ఉంది” అని చెప్పారు. ఆయన మాటల్లో ఆ ప్రాజెక్ట్ మీద ఉన్న గౌరవం, బాధ్యత స్పష్టంగా కనిపించింది.

ప్రాజెక్ట్ పట్టాలెక్కితే తాను ఏ పాత్ర పోషించాలని అనుకుంటున్నాడని అడిగినప్పుడు – “శ్రీకృష్ణ పాత్ర నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన పాత్రంటే నాకు ఎంతో ఇష్టం” అన్నారు. అంటే ఏమీ ఖరారు కాకపోయినా, ఆమిర్ ఖాన్ శ్రీకృష్ణ పాత్రలో కనిపించే అవకాశం బలంగా ఉంది.

ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ఓ భారీ ఫ్రాంచైజీగా రూపొందనుందని, ఇందులోని వివిధ భాగాలను భిన్న దర్శకులు తెరకెక్కించనున్నారని సమాచారం. ఆమిర్ ఖాన్ గతంలో దీనిపై క్లారిటీ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.

సోషల్ మీడియాలో ఈ వార్త బయటకిరాగానే, అభిమానులు ఖుషీగా స్పందిస్తున్నారు. “ఆమిర్ ఖాన్ కృష్ణుడిగా అంటే, చాలా ఇంట్రెస్టింగ్!” అంటూ కామెంట్స్ వస్తున్నాయి. కొన్ని మిమ్స్ కూడా ట్రెండింగ్‌లో ఉన్నాయి.

సుమారు పదేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నా, ఈసారి మాత్రం ఆమిర్ డైరెక్ట్‌గా స్పందించడంతో అంచనాలు బాగానే పెరిగాయి. మరి ఈ కల నిజమవుతుందా? అభిమానులకి ఈ సమాధానం కోసం ఇంకాస్త ఆగాల్సిందే!

ALSO READ: Sree Vishnu’s Single Review: థియేటర్లలో కామెడీ వర్క్ అయ్యిందా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu