HomeTelugu Trendingమానవత్వాన్ని చాటుకున్న హీరో విజయ్‌

మానవత్వాన్ని చాటుకున్న హీరో విజయ్‌

Vijay donate oxygen cylinde

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కరోనా సెకండ్‌వేవ్‌ నేపధ్యంలో ఆస్పత్రుల్లో రోగులకు చేయూత నివ్వడానికి నేనున్నానంటూ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.విరుదాచలంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగుల కోసం ఆక్సిజన్‌ సిలిండర్లు వైద్యులకు, ఆస్పత్రిలో పని చేసే కార్మికులకు అవసరమైన మాస్కులను సాయంగా అందించారు. విజయ్‌ ఆదేశాలతో ఆయన కార్యదర్శి బుస్సీ ఎన్‌.ఆనంద్‌ సలహా మేరకు కడలూరు జిల్లా నిర్వాహకుడు శీను, కడలూరు పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్‌ ఆధ్వర్యంలోజిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు అబ్బాస్‌ మంగళవారం సేవల్లో నిమగ్నమయ్యారు. కార్యక్రమంలో కడలూరు తూర్పు జిల్లా విభాగం అధ్యక్షుడు రాజ్‌కుమార్, పశ్చిమ జిల్లా కార్యదర్శి రాజేష్, విరుదాచలం నగర అధ్యక్షుడు వాసు, జిల్లా నిర్వాహకుడు శక్తివేల్, నటుడు విజయ్‌ ప్రజా సంఘానికి చెందిన వారు పాల్గొన్నారు. కాగా ప్ర‌స్తుతం విజయ్‌ త‌న 65వ సినిమాతో బిజీగా ఉన్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu