జగ్గుభాయ్ లో కొత్త యాంగిల్!

అప్పటి వరకు హీరోగా సినిమాలు చేసిన జగపతిబాబు లోని విలన్ యాంగిల్ ను ‘లెజెండ్’ సినిమా ద్వారా ప్రెజంట్ చేశాడు దర్శకుడు యపాటి. ఆ సినిమా తరువాత విలన్ పాత్రలతో బిజీగా మారిపోయాడు జగపతి బాబు. తెలుగులోనే కాకుండా.. తమిళం, మలయాళం సినిమాల్లో సైతం ఆయన హవా కొనసాగుతోంది.

అయితే రెగ్యులర్ విలన్ పాత్రల్లో ఆయన గెటప్ ఒకేలా ఉండడంతో రొటీన్ గా అనిపిస్తోంది. అయితే ఇప్పుడు మళ్ళీ బోయపాటి, జగ్గుభాయ్ లోని మరో కొత్త యాంగిల్ చూపించడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర కోసం జగపతి బాబును ఎన్నుకున్నారు. ఈ సినిమా జగపతి బాబు గెటప్, మేకోవర్ కొత్తహ్గా ఉంటాయని..

ఈ సినిమాతో ఆయన కెరీర్ మరో మలుపు తీసుకోవడం ఖాయమని చెబుతున్నారు. ఈ పాత్ర కోసం ఇటీవల ఆయనపై బోయపాటి ఓ ఫోటో షూట్ కూడా చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో నటించడానికి జగపతి బాబు కూడా ఎగ్జైట్ అవుతున్నట్లు సమాచారం.