HomeTelugu Trendingమహేష్‌తో సినిమా చేస్తా: విజయ్‌ ఆంటోనీ

మహేష్‌తో సినిమా చేస్తా: విజయ్‌ ఆంటోనీ

vijay antony wants to movie

తమిళ హీరో విజయ్‌ ఆంటోనీ నటిస్తోన్న తాజా చిత్రం ‘బిచ్చగాడు 2’.ఈ సినిమాకి ఆయనే దర్శకత్వం వహిస్తూ.. హీరోగా నటిస్తున్నాడు. కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బిచ్చగాడు 2 మే 19న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళంతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది విజయ్‌ ఆంటోనీ టీం. ఇందులో భాగంగా కావ్యథాపర్ తో చిట్‌చాట్‌ సెషన్‌లో విజయ్‌ ఆంటోనీ ఆసక్తికర విషయం చెప్పాడు.

విజయ్‌ ఆంటోనీ ఓ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో ఇతర స్టార్లను డైరెక్ట్ చేయాల్సి వస్తే.. అని అడిగింది. టాలీవుడ్‌లో సినిమా చేస్తే నాకు మహేశ్‌ బాబు లాంటి పెద్ద స్టార్ కావాలి. ఆయనకు మార్కెట్‌ చాలా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకేముంది అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే భవిష్యత్‌లో విజయ్‌ ఆంటోనీ-మహేశ్ బాబు కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఫ్యాన్స్‌ అనుకుంటున్నారు.

ఇప్పటికే ‘బిచ్చగాడు 2’ నుంచి విడుదలైన అప్డేట్స్‌ ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని కలిగించాయి. బిచ్చగాడు 2 చిత్రానికి విజయ్‌ ఆంటోనీ సంగీతమందిస్తున్నాడు. ఈ చిత్రంలో హరీష్‌ పేరడి, దేవ్‌ గిల్, జాన్ విజయ్‌, యోగిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోం బ్యానర్‌ విజయ్ ఆంటోని ఫిలిం కార్పొరేషన్‌ బ్యానర్‌పై ఫాతిమా విజయ్ ఆంటోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu