అఖిల్ డైరెక్టర్ తో నాని..?

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నానికి స్పెషల్ క్రేజ్ ఉంది. వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న నాని బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతున్నాడు. సినిమా సినిమాకు వేరియేషన్ చూపుతూ తన మార్కెట్ పరిధిని పెంచుకుంటున్నాడు. పెద్ద పెద్ద దర్శకులు సైతం ఆయనతో సినిమా చేయాలని ఆశ పడుతున్నారు. ఈ క్రమంలో ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్.. నానితో సినిమా చేయాలనుకుంటున్నట్లుగా సమాచారం. ఇటీవల విక్రమ్.. నానిని కలిసి కొన్ని కథలను నేరేట్ చేసినట్లుగా సమాచారం. వాటిలో ఓ కథను నానితో చేయాలనుకుంటున్నాడు. నాని కూడా విక్రమ్ వినిపించిన కథల పట్ల ఆసక్తిని చూపుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో కథల విషయంలో నాని చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపధ్యంలో విక్రమ్ తో సినిమా చేయడానికి ఆయన సముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విక్రమ్ కుమార్.. అఖిల్ హీరోగా ‘హలో’ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా డిసంబర్ నెలలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పూర్తయిన తరువాత నానితో సినిమా మొదలుపెట్టాలని చూస్తున్నాడు విక్రమ్.