HomeTelugu Trendingసలార్‌: 'వినరా' సాంగ్‌ విడుదల

సలార్‌: ‘వినరా’ సాంగ్‌ విడుదల

Vinaraa song from Salaar

పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ – దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘సలార్’. హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. భారీ అంచనాల మధ్య ఈ నెల 22వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వసూళ్ల పరంగా కొత్త రికార్డులను నమోదు చేస్తుంది.

ఈ కథ హీరో ప్రభాస్ .. అతని స్నేహితుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ చుట్టూ తిరుగుతుంది. చిన్నప్పుడు ఈ ఇద్దరి స్నేహానికి సంబంధించిన ఎపిసోడ్ తోనే ఈ కథ మొదలవుతుంది. అలాంటి వీరి స్నేహంపై ఎమోషన్స్ తో కూడిన ఒక సాంగ్ ఉంది. తాజాగా ఈ పాటను విడుదల చేశారు.

‘వినరా’ అంటూ సాగిన ఈ పాట ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ పాత్రలకి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ పాట .. సున్నితమైన భావోద్వేగాలతో ప్రేక్షకులకు పట్టుకుంటుంది. రవి బస్రూర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ పాట, ప్రధానమైన కథాంశాన్ని ఆవిష్కరిస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu