కోలీవుడ్ బ్యూటీ నమిత దంపతులు శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందచేశారు. అనంతరం నమిత మీడియాతో మాట్లాడుతూ.. దర్శనానంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ, పలు విషయాల గురించి మాట్లాడారు. తాను నటిస్తున్న ‘భౌ భౌ’ చిత్రం షూటింగ్ పూర్తయిందని తెలిపారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయాలా? లేక ఓటీటీలో విడుదల చేయాలా? అనే సందిగ్ధతలో నిర్మాతలు ఉన్నారని చెప్పారు. మరోవైపు తాను సినీ నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టబోతున్నట్టు తెలిపారు. 2017లో తన ప్రియుడు వీరేంద్రను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా నమిత నటిస్తూనే ఉన్నారు.