17న ‘తస్సాదియ్యా…’ అంటున్న రామ్‌చరణ్‌!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, కైరా అద్వాణీ హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. ఈ సినిమా కి బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. డి.వి.వి ఎంటర్‌టైన్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి డి.వి.వి. దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. రెండు పాటలు మినహా చిత్రీకరణ పూర్తయింది. నిర్మాత మాట్లాడుతూ.. ‘యాక్షన్‌ ఎంటర్‌టైర్‌గా రూపొంతున్న చిత్రమిది. అభిమానుల అంచనాల్ని మించిపోయేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. ఈ నెల 26 వరకు జరిగే పాటల చిత్రీకరణతో సినిమా పూర్తవుతుంది.

ఈ సినిమాలో ఓ ప్రత్యేక గీతాన్ని రామ్‌ చరణ్‌, ఈషా గుప్తాపై చిత్రీకరిస్తున్నాం. ఈ నెల 17న ‘తస్సాదియ్యా…’ అనే పాటని విడుదల చేస్తాం. సంక్రాంతి సందర్భంగా విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు కనువిందు చేయనుంది’ అన్నారు. వివేక్‌ ఒబెరాయ్‌, ప్రశాంత్‌, ఆర్యన్‌ రాజేష్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు.