ఇళయరాజాపై కేసు పెట్టిన నిర్మాతలు..!

సంగీత దర్శకుడు ఇళయరాజాపై ఆరుగురు నిర్మాతలు మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. వివరాల్లోకి వెళితే ఇళయరాజా గతంలో తన పాటలని తన అనుమతులు లేకుండా పలువురు గాయకులు, టీవీ ఛానెల్స్ వాడుకుంటున్నాయని కేసు వేశారు. దానికి కౌంటర్ ఇస్తూ నిర్మాతలు తాము డబ్బు పెట్టి తీసిన సినిమాల్లోని పాటల్ని తాము వాడుకోవడంలో తప్పేముందని, ఇళయరాజా కేసు చెల్లితే అందులో నటించిన నటీ నటులు కూడ కేసులు వేయాలి కదా అంటూ తమ పిటిషన్లో పేర్కొన్నారు. మరి ఈ కేసును న్యాయస్థానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.