వినాయక్ గ్రాఫ్ తగ్గుతోందా..?

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒక్కడైన వి.వి.వినాయక్ మీడియం రేంజ్ డైరెక్ట‌ర్ స్థాయికి ప‌డిపోతున్నాడా ? అన్న సందేహాలు వ‌చ్చేస్తున్నాయి. కొంత‌మంది డైరెక్ట‌ర్లు వ‌రుస హిట్ల‌తో త‌మ రేంజ్ పెంచుకుంటుంటే వినాయ‌క్ మాత్రం మీడియం రేంజ్ హీరోల‌తోనే సినిమాలు చేసేందుకు రెడీ అవుతుండ‌డంతో ఈ అనుమానాలు క‌ల‌గ‌క మాన‌డం లేదు.  ఖైదీ నెంబర్ 150 తర్వాత వినాయక్ కి ఆఫర్లు రాలేదు. కాస్త ఆలస్యంగానే సి. కళ్యాణ్ నిర్మాతగా సాయి ధరమ్ తేజ్ హీరోగా సినిమా మొదలు పెట్టారు.

ఈ సినిమాను వ‌చ్చే ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రానున్నారు. ఈ సినిమా త‌ర్వాత అయినా వినాయ‌క్ పెద్ద హీరోతో భారీ బ‌డ్జెట్ సినిమా తీస్తార‌ని అంద‌రూ ఊహించారు. అయితే వినాయ‌క్ సాయి ధరమ్ తేజ్ సినిమా తర్వాత నల్లమలుపు బుజ్జి నిర్మాతగా వరుణ్ తేజ్ శ్రీనివాస్‌తో సినిమా చేస్తున్న‌ట్టు స‌మాచారం. దీంతో వినాయక గ్రాఫ్ రోజురోజుకి పడిపోతుందనే మాటలు వినిపిస్తున్నాయి.