అల్లుడి కోసం రజినీకాంత్!

ధనుష్ హీరోగా సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో ఎస్.థాను నిర్మిస్తోన్న చిత్రం ‘విఐ‌పి‌2’. ఈ సినిమా షూటింగ్ ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సూపర్ స్టార్ రజినీకాంత్ క్లాప్ కొట్టారు. రజినీకాంత్ స్వయంగా వచ్చి ఆశీస్సులు అందించడంతో ధనుష్ చాలా సంతోషపడ్డాడు.

‘ఇంతకన్నా ఏం కోరుకోగలను..? అందరి ఆశీస్సులతో ‘విఐపి2′ సినిమా మొదలైంది’ అంటూ ట్వీట్ చేశారు. గతంలో వచ్చిన ‘విపిపి’ చిత్రానికి ఇది సీక్వెల్ గా తెరకెక్కుతోంది. విఐపి సినిమా తమిళంలో పెద్ద హిట్ అయింది. ఈ చిత్రాన్ని ‘రఘువరన్ బి.టెక్’ పేరుతో తెలుగులో అనువదించారు. తెలుగులో కూడా సినిమా మంచి విజయాన్ని అందుకొంది. మరి ‘విఐపి2’ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో.. చూడాలి!