HomeTelugu Trendingఆ సినిమాలో బాటలో విరాటపర్వం

ఆ సినిమాలో బాటలో విరాటపర్వం

Virata Parvam movie relea

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రానా, సెన్సేషనల్‌ బ్యూటీ సాయిప‌ల్ల‌వి జంట‌గా నటిస్తున్న చిత్రం ‘విరాట‌ప‌ర్వం’. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో రూపొందుతోన్న ఈ సినిమాని డి. సురేష్ బాబు స‌మ‌ర్ప‌ణ‌లో ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. “రివ‌ల్యూష‌న్ ఈజ్ ఏన్ యాక్ట్ ఆఫ్ ల‌వ్” అనేది ట్యాగ్‌లైన్‌. ఏప్రిల్ 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించిన నిర్మాతలు తాజాగా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌లో క్రమంగా సినిమా రిలీజ్‌లు వెనక్కి వెళుతున్నాయి. ఈ నేపధ్యంలో ‘విరాటపర్వం’ చిత్రాన్ని కూడా వాయిదా వేస్తున్నామని త్వరలోనే కొత్త రిలీజ్‌ డేట్‌ ఎప్పుడో ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు. ఇప్పటికే ఏప్రిల్‌ 16న విడుదల కావాల్సిన ‘లవ్‌స్టోరి’, ఏప్రిల్‌ 23న విడుదల కావాల్సిన ‘టక్‌ జగదీష్‌’ చిత్రాలు వాయిదా పడ్డాయి. తాజాగా ఈ లిస్ట్‌లో ‘విరాటపర్వం’ కూడా చేరింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu