HomeTelugu Trending'విరాటపర్వం' థియేటర్స్‌లోనే: మూవీ యూనిట్‌

‘విరాటపర్వం’ థియేటర్స్‌లోనే: మూవీ యూనిట్‌

Virataparvam release in tదగ్గుబాటి రానా హీరోగా నటిస్తున్న చిత్రం విరాటపర్వం. వేణు ఊడుగుల డైరెక్షనలో వస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది. 1990 నాటి నేపథ్యంలోని నక్సలైట్ల జీవన విధానం.. ఆశయ సాధనలో వాళ్లు ఎదుర్కున్న ఇబ్బందులను.. అలాగే కుటుంబ జీవనానికి దూరమైన వాళ్లలో కలిగే ఎమోషన్స్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమాను, ఏప్రిల్ 30వ తేదీన విడుదల చేయాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడిందిఇ.

అయితే థియేటర్లు తెరుచుకునేంతవరకూ ఈ సినిమాను వెయిటింగులో పెట్టే పరిస్థితులు కనిపించడం లేదనీ, ఓటీటీలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయనే వార్తలు వచ్చాయి. త్వరలోనే ఈ విషయమై సురేశ్ బాబు ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని చెప్పుకున్నారు. కానీ ఈ వార్తలో నిజం లేదనే విషయాన్ని మేకర్స్ స్పష్టం చేశారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను ఎప్పుడో విక్రయించేశారట. అలాగే శాటిలైట్ .. డిజిటల్ .. డబ్బింగ్ హక్కులను కూడా అమ్మేశారట. అందువలన ఈ సినిమా కచ్చితంగా థియేటర్లకే వస్తుందనే విషయాన్ని స్పష్టం చేశారు. త్వరలోనే విడుదల తేదీని ప్ర్రకటిస్తామని తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu