HomeTelugu Trending'విరూపాక్ష' టీజర్‌

‘విరూపాక్ష’ టీజర్‌

Virupaksha Movie teaserమెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ హిట్‌ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న క్రమంలో బైక్‌ యాక్సిడెంట్‌కి గురైయ్యాడు. దీంతో చాలా రోజులు బయట ప్రపంచాన్నికి దూరంగా ఉన్నాడు. ప్రమాదం నుంచి కోలుకున్న సాయితేజ్‌ నటిస్తున్న తొలి సినిమా ‘విరూపాక్ష’. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ దండు దర్శకత్వం వహించాడు. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది.

ఈ సినిమా టీజర్ ను ముందుగా పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌కి చూపించారు. ఆయనకి టీజర్ బాగా నచ్చినట్టుగా వార్తలు రావడంతో, ప్రేక్షకుల్లో మరింతగా ఆసక్తి పెరిగింది. నిన్ననే విడుదల కావలసిన ఈ టీజర్ కొన్ని కారణాల వలన వాయిదా పడింది. ఈ క్రమంలో ఈ రోజు ఈ టీజర్ ను రిలీజ్ చేశారు. ‘చరిత్రలో ఇలాంటి ఒక సంఘటన జరగడం ఇదే మొదటిసారి. దీని నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది’ అనే డైలాగ్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

హారర్ టచ్ తో నడిచే సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ కథ కనిపిస్తోంది. అజనీశ్ లోక్ నాథ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా నిలుస్తుందని అనిపిస్తోంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఏప్రిల్ 21న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తరువాత తన మమాయ్య పవన్‌ కళ్యాణ్‌ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్‌ దశలో ఉంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu