నడిగర సంఘం ఎన్నికలక పోటీకి విశాల్‌ సిద్ధం

నడిగర సంఘం ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. 2019 వ సంవత్సరానికి జరగబోతున్న ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హీరో విశాల్ సిద్ధం అయ్యారు. విశాల్ తన నామినేషన్ పేపర్లను నడిగర సంఘానికి సమర్పించారు. గత ఎన్నికల్లో విశాల్ మెజారిటీతో విజయం సాధించి నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికైన సంగతి తెలిసిందే.

విశాల్ నటించిన అయోగ్య సినిమా ఇటీవలే విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. నడిగర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉంటూనే… సినిమాలు చేస్తున్నాడు. సినీ రంగానికి సంబంధించిన సమస్యలపై పోరాటం చేస్తున్నాడు.