HomeTelugu Trendingప్లాస్టిక్ పై చిన్నారుల ఫైట్... కేటీఆర్‌ ఫిదా

ప్లాస్టిక్ పై చిన్నారుల ఫైట్… కేటీఆర్‌ ఫిదా

6 22
ప్రపంచాన్ని భయపెడుతున్న వాటిల్లో ప్లాస్టిక్ కూడా ఒకటి. ప్లాస్టిక్ నుంచి బయటపడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను ప్రతి ఒక్కరు కూడా నిషేధిస్తే తప్పకుండా ఫలితాలు కనిపిస్తాయి. అందులో సందేహం అవసరం లేదు. అయితే, స్కూల్ కు వెళ్లే చిన్నారులు ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. మేము ఇప్పుడే ఎదుగుతున్నాము… ఆరోగ్యకర వావతారణంలో పెరిగే హక్కు మాకున్నది. ప్లాస్టిక్ వాడకం ఆపేయండి ప్లీజ్ అంటూ చిన్నారులు చేయి చేయి పట్టుకొని రోడ్డుపక్కన నిలబడి ఉన్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని కదిలిస్తున్నాయి. మంత్రి కేటీఆర్ చిన్నారులు చేసిన పనికి ముచ్చట పడ్డాడు. వెంటనే దానికి సంబంధించిన చిన్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. చిన్నారులు చేస్తున్న పనిని అభినందిస్తూ వారి వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu