HomeTelugu Trending'మెరిసే మెరిసే' ట్రైరల్‌

‘మెరిసే మెరిసే’ ట్రైరల్‌

Merise Merise trailer
హుషారు, ప్లే బ్యాక్ ఫేమ్ దినేష్ తేజ్- శ్వేతా అవస్తి హీరోహీరోయిన్‌లుగా నటించిన తాజా చిత్రం ‘మెరిసే మెరిసే’. ఈ చిత్రానికి కె. పవన్ కుమార్ దర్శకుడు. కొత్తూరి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎల్ఎల్‌పి బ్యానర్ పై వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాను ఆగస్టు 6న థియేటర్లలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను ‘మాస్ కా దాస్’ హీరో విశ్వక్ సేన్ విడుదల చేశారు. విభిన్న మనస్తత్వాలు కలిగిన హీరో, హీరోయిన్ మధ్య ప్రేమ ఎలా పుట్టిందో, వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు, ఎమోషన్స్‌ ట్రైలర్‌లో చూపించారు. ఈ చిత్రంలో సంజయ్ స్వరూప్, గురు రాజ్, బిందు,శశాంక్, నానాజీ ఇతర పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి కార్తీక్ కొడకండ్ల సంగీతం అందించారు. ఆగస్టు 6న థియేటర్ లలో రిలీజ్ అవుతుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu