HomeTelugu Big Storiesసీక్రెట్‌గా పెళ్లి చేసుకుని తల్లి అయిన నటి

సీక్రెట్‌గా పెళ్లి చేసుకుని తల్లి అయిన నటి

Viswaroopam actress pooja k
విశ్వరూపం ఫేమ్‌ పూజా కుమార్‌ తల్లి అయింది. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పూజా ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని పూజా భర్త విశాల్‌ జోషి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అప్పుడే పాపకి నవ‍్య జోషి అని పేరు కూడా పెట్టేశారు. తనకు కూతురు పుట్టిందన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఒకప్పుడు మేము ఇద్దరం. కానీ ఇప్పుడు ముగ్గురం. మా చిన్నారి పాప నవ్య జోషిని మీ అందరికి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫిల్‌ అవుతున్నాం. నేను కలలుగన్న గొప్ప భాగస్వామిగా నాజీవితంలోకి వచ్చినందుకు, లిటిల్‌ నవ్యను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు నీకు(పూజా) ధన్యవాదాలు. నా ఈ పుట్టినరోజును బెస్ట్‌ పుట్టినరోజుగా మలిచావు. లవ్‌ యూ బోత్‌ సో మచ్’‌.. అంటూ సతీమణి, కూతురిపై ప్రేమను కురిపించారు. అలాగే వీరిద్దరూ కూతురుతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరలవుతున్నాయి.

న‌టి పూజా కుమార్ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారు. వెడ్డింగ్‌ ప్లానింగ్‌ కంపెనీ ‘జాయ్‌’ సీఈఓ విశాల్ జోషి అనే వ్యక్తిని పూజా కుమార్ వివాహం చేసుకున్నారు. కాగా 2000లో కాదల్ రోజావే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ కమల్ హాసన్ సరసన యాక్షన్ థ్రిల్లర్ విశ్వరూపంలో(2013) నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత కమల్‌తో మరోసారి విశ్వరూపం-2, ఉత్తమ విలన్ సినిమాలతో జతకట్టారు. ఇక పూజా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. రాజశేఖర్‌ నటించిన ‘గరుడ వేగ’లో నటించారు. అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జన్మించిన పూజా భ‌ర‌తనాట్యం, క‌థ‌క్, కూచిపూడిలో ఆమె శిక్ష‌ణ పొందారు. 1995లో మిస్ ఇండియా యూఎస్ఏ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు. మ్యాన్ ఆన్ ఎ లెడ్జ్, బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99, బాలీవుడ్ హీరో వంటి హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు.

https://www.instagram.com/p/CJdlV2aJCio/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!