చరణ్ సినిమాలో హెవీ ప్యాడింగ్!

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న వెరైటీ ప్రేమకథ ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం గానీ ఈ సినిమాలో ప్యాడింగ్ మాత్రం హెవీ గా పెడుతున్నారు. ఇప్పటికే ఆది పినిశెట్టి, జగపతి బాబు వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. ఆయన రోల్ చాలా కొత్తగా భిన్నంగా తీర్చిదిద్దాడట సుకుమార్. ఈ మధ్య కాలంలో ప్రకాష్ రాజ్ కు సినిమాలు తగ్గిపోతున్న తరుణంలో ఆయనకు ఈ పాత్ర మరిన్ని అవకాశాలను తెచ్చి పెడుతుందని చెబుతున్నారు. అలాగే ఈ సినిమాలో రావు రమేష్, పృధ్వీ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాధారణంగా సుకుమార్ సినిమాల్లో కామెడీ చాలా తక్కువగా కనిపిస్తుంది.
కానీ దానికి భిన్నంగా ఈ సినిమాలో కామెడీ కంటెంట్ బాగా దట్టించాడట. దానికోసం జబర్దస్త్ షోలో నటించే పలు ఆర్టిస్టులను కూడా తీసుకున్నారని సమాచారం. చరణ్, సమంత తొలిసారి జంటగా నటిస్తోన్న ఈ సినిమా 1980ల బ్యాక్ డ్రాప్ లో నడిచే ప్రేమ కథ అని సమాచారం. ఈ సినిమాలో చరణ్ వినికిడి లోపమున్న ఓ మత్స్యకారుడి పాత్రలో కనిపించనుండగా, సమంత సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి పాత్రలో కనిపించనుంది.