HomeTelugu Trendingఅహింస: ఉందిలే ఉందిలే పాట విడుదల

అహింస: ఉందిలే ఉందిలే పాట విడుదల

Vundhiley Vundhiley Lyrical
టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు చిన్న కొడుకు దగ్గుబాటి అభిరామ్ టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం ‘అహింస’. తేజ డైరెక్షన్‌లో వస్తున్న ఈసినిమా నుండి ఇప్పటికే రిలీజ్ చేసిన టీజ‌ర్‌, ట్రైలర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా ఈ సినిమా ‘ఉందిలే ఉందిలే’ మూడో పాటను హీరో విక్టరీ వెంకటేశ్‌ విడుదల చేశాడు.

ఘన ఘన ఉరిమే ఉరిమిన వెంటనే గల గల చినుకే ఉందిలే.. నల్ల నల్ల చీకటి ముసిరిన వెనుకే తళ తళ వెలుగే ఉందిలే అంటూ సాగుతున్న ఈ పాటను చంద్రబోస్ రాశారు. ఆర్‌.పీ. పట్నాయక్‌ కంపోజిషన్‌లో జావెద్ అలి, జయశ్రీ పాడారు. అహింస చిత్రాన్ని ఆనంది ఆర్ట్స్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై పీ కిర‌ణ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో గీతికా హీరోయిన్‌గా న‌టిస్తోంది.

లవ్‌ ట్రాక్‌తోపాటు ఫ్యామిలీ, ఎమోష‌న్స్, యాక్షన్‌ సీక్వెన్స్ తో సినిమా ఉండబోతున్నట్టు ట్రైలర్‌తో క్లారిటీ ఇచ్చేశాడు తేజ. అహింసలో యాక్టర్‌ కమ్‌ డైరెక్టర్‌ సముద్రఖని విల‌న్‌గా న‌టిస్తున్నాడు. రజత్‌ బేడి, రవి కాలే, కమల్ కామరాజు, మనోజ్‌ టైగర్‌, కల్పలత, దేవీ ప్రసాద్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రం జూన్‌ 2న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu