HomeTelugu Trending'అహింస' రివ్యూ

‘అహింస’ రివ్యూ

Ahimsa Review

ప్రేమ కథ చిత్రాల స్పెషలిస్ట్‌ ద‌ర్శ‌కుడు తేజ డైరెక్షన్‌లో ద‌గ్గుబాటి అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చిన చిత్రం ‘అహింస’. ఈ మూవీ గ్లింప్స్‌, టీజ‌ర్‌, ట్రైల‌ర్ ఆస‌క్తిని రేకెత్తించింది. చిత్రం, నువ్వు నేను, జయం వంటి సూపర్‌ హిట్‌ సినిమాలను తీసిన ద‌ర్శ‌కుడు తేజకి హిట్ వచ్చిందా? అస‌లు అహింస‌తో తేజ ఏం చెప్పాల‌నుకున్నారు?. దగ్గుబాటి అభిరామ్‌కి సరైనా డెబ్యూ పడిందా.. తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

రఘు (దగ్గుబాటి అభిరాం) అహింస సిద్ధాంతాన్ని నమ్మే కుర్రాడు. అతనికి తల్లిదండ్రులు ఉండ‌రు. అత్త‌, మామ‌లే పెంచుతారు. మ‌ర‌ద‌లు అహ‌ల్య (గీతికా తివారి)కి బావ ర‌ఘు అంటే ప్రాణం. ర‌ఘుకి కూడా మ‌ర‌ద‌లంటే ఎంతో ప్రేమ ఉంటుంది. ఇద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని పెద్ద‌లు నిర్ణ‌యం తీసుకుంటారు. అదే స‌మ‌యంలో సిటీలో డ‌బ్బున్న వ్య‌క్తి దుష్యంత్ రావు (ర‌జ‌త్ బేడి) ఇద్ద‌రు కొడుకులు అలేఖ్యను పాడు చేస్తారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ర‌ఘు హాస్పిట‌ల్‌లో చేరుస్తాడు. అత‌ని అండ‌గా ఓ లేడీ లాయ‌ర్ లక్ష్మి (స‌దా).. ఆమె భ‌ర్త నిలుస్తారు. దుష్యంత్ రావు త‌న డ‌బ్బు, ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి కేసుని తప్పు దారి పట్టించాలా అని చూస్తాడు. అయితే ర‌ఘు ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడిలా సాక్ష్యాల‌ను తీసుకొచ్చి కేసుని త‌న‌కు అనుకూలంగా మార్చుకునే స‌మ‌యంలో చ‌ట‌ర్జీ ఎంట్రీతో అంతా తారు మార‌వుతుంది. చివ‌ర‌కు అహింస‌ను న‌మ్మే ర‌ఘు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడు? ర‌ఘు, అహ‌ల్య‌ల‌కు న్యాయం జ‌రుగుతుందా? దుష్యంత్ రావు ఏమౌతాడు? అనే విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Ahimsa Review 1

డైరెక్టర్‌ తేజ తెర‌కెక్కించిన ప్రేమ క‌థా చిత్రాల్లో డ‌బ్బున్న వ్య‌క్తికి, డ‌బ్బు లేని వ్య‌క్తికి మ‌ధ్య పోరాటం ఉంటుంది. దాన్ని హీరో ఎలా అధిగ‌మించి విజ‌యం సాధించాడ‌నే కాన్సెప్ట్‌తోనే తేజ సినిమాలుంటాయి. తేజ గత సినిమాల మాదిరిగానే.. పలు స‌న్నివేశాల‌ను ‘అహింస’ సినిమాలోనూ చూపించారు. సినిమా అంతా లాగిన‌ట్లు వెళ్లిపోయింది. సినిమాను కాస్త ట్రిమ్ చేసుంటే బావుండేద‌నిపించింది. చాలా గ్యాప్ త‌ర్వాత నేను రాజు నేనే మంత్రి సినిమాతో హిట్ కొట్టిన తేజ‌.. సీత చిత్రంతో నిరుత్సాహ ప‌రిచారు. పోనీ అహింస మూవీతో మ‌రో స‌క్సెస్ అందుకుంటాడేమోన‌ని భావిస్తే.. ఇది కూడా నిరుత్సాహ‌ప‌డింది. ఇక సినిమాలో లాజిక్స్ వెతుక్కోక పోతే మ‌రీ మంచిది. ఇక చాలా సంవత్స‌రాల త‌ర్వాత తేజ‌, అర్పీ ప‌ట్నాయ‌క్ కాంబినేష‌న్‌లో అహింస సినిమా వ‌చ్చింది. ‘ఉందిలే..’ పాట మినహా మరే పాట అంతగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం పర్వలేదు. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బావుంది. ద‌గ్గుబాటి అభిరామ్‌ తొలి సినిమా అయిన.. న‌ట‌న ప‌రంగా మెప్పించే ప్ర‌య‌త్నం చేశాడు. స‌న్నివేశాల‌ను కూడా తేజ చాలా ప్లానింగ్‌తో చేయ‌టం అభిరామ్‌కు క‌లిసొచ్చింది. ఇక గీతికా తివారి నటన గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. క‌మ‌ల్ కామ‌రాజు, స‌దా, ర‌వి కాలే, ర‌జ‌త్ బేడి, చ‌ట‌ర్జీ తమ తమ పరిధిలో నటించారు.

టైటిల్‌ :అహింస
నటీనటులు: అభిరామ్ దగ్గుబాటి,గీతిక, సదా, రజత్ బేడి, కమల్ కామరాజు తదితరులు
దర్శకత్వం: తేజ
నిర్మాత: సురేష్ బాబు-జెమిని కిరణ్
సంగీతం: ఆర్పీ పట్నాయక్

చివరిగా: అహింస కాదు హింస

‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu