HomeTelugu Trendingవీవీ వినాయక్‌ హీరోగా ఫస్ట్‌లుక్‌

వీవీ వినాయక్‌ హీరోగా ఫస్ట్‌లుక్‌

5 7దర్శకుడిగా వివి వినాయక్ అనేక చిత్రాలు చేశారు. ఆది, ఠాగూర్, చెన్నకేశవరెడ్డి, అదుర్స్, దిల్ రీసెంట్ గా ఖైదీ నెంబర్ 150 వంటి సినిమాలు వినాయక్ బెస్ట్ సినిమాల్లో కొన్ని అని చెప్పొచ్చు. ఈ దర్శకుడు ఇప్పుడు హీరోగా మారుతున్నారు. దిల్ రాజు నిర్మాణంలో వివి వినాయక్ లీడింగ్ రోల్ చేస్తూ సీనయ్య అనే సినిమా చేస్తున్నారు. టైటిల్ క్లాస్ గా ఉన్నా ఆ టైటిల్ ను డిజైన్ చేసిన విధానం పక్కా మాస్ గా కనిపిస్తోంది.

వినాయక్ లుక్ సైతం అంతే మాస్ గా ఉన్నది. చేతిలో ఓ రెంచ్, మేడలో రెడ్ కలర్ టవల్ తో సీరియస్ లుక్ లో ఉన్న ఫోటో అది. రేపు వివి వినాయక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. శరభ సినిమాకు దర్శకత్వం వహించిన నరసింహారావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో సినిమా తెరకెక్కుతుండటం విశేషం. దర్శకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న వినాయక్, నటుడిగా కూడా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిద్దాం.

Recent Articles English

Gallery

Recent Articles Telugu