పెళ్లి పత్రికపై ‘బాలయ్య’ ఫోటో.. వైరల్‌

సినీ పరిశ్రమలో హీరోలకు ఉండే క్రేజే వేరు. సీనియర్‌ హీరోలకు అయితే మరీనూ. తమ ఆరాధ్య కథానాయకుల పేర్లను వాహనాల మీదనో, పచ్చబొట్టుగానో రాయించుకుని అభిమానులు సంబర పడిపోతుంటారు. వారి పేరు మీద ఎన్నో సామాజిక సేవలు కూడా చేస్తుంటారు. ఇక స్టార్‌ హీరోల్లో నందమూరి బాలకృష్ణ అభిమానుల గురించి తెలిసిందే. నిజానికి అభిమానులందు బాలకృష్ణ అభిమానులు వేరయా..అనే వాళ్లు లేకపోలేదు. ఇందుకు ఉదాహరణగా కర్ణాటకలోని శ్రీనివాసులు అనే వ్యక్తి బాలయ్య పట్ల తనకున్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. తన కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికపై బాలకృష్ణకు సంబంధించిన వివిధ స్టిల్స్‌ను ముద్రించారు. దీంతో పాటు పెళ్లి పత్రిక పై ‘బాలకృష్ణ మా ఆరాధ్య దైవం..ఆయన ఆశీస్సులు మాకెప్పుడూ కావాలి’ అని రాశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

CLICK HERE!! For the aha Latest Updates