ఆళ్ల రామకృష్ణారెడ్డి గ్రాఫ్ ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది ?

ఈ రోజు రాజకీయ నాయకుడి గ్రాఫ్ ? మరియు నేపథ్యం విషయానికి వస్తే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి. ప్రస్తుతం ప్రజల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పరిస్థితేంటి ?, అసలు ఆయన నేపథ్యం ఏమిటి ? తెలుసుకుందాం రండి. ఉమ్మడి గుంటూరు జిల్లా పెదకాకాని మండలం పెదకాకాని గ్రామంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి జన్మించారు. ఎన్నికల అఫిడవిట్ ప్రకారం గుంటూరు లోని ఏసి కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. కానీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పుణె లో ఉన్న మహారాష్ట్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రింటింగ్ టెక్నాలజీ లో డిప్లొమా పూర్తి చేశాను అని పేర్కొన్నారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజకీయాల్లో రాకముందు తమ కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థ రాంకీ గ్రూప్ లో పలు కీలక బాధ్యతలు నిర్వహించారు.


ఆళ్ల రామకృష్ణారెడ్డి తల్లిదండ్రులు పెదకాకాని గ్రామ సర్పంచ్ లుగా పనిచేశారు. తల్లిదండ్రుల స్ఫూర్తి తో రాజకీయాల్లో అడుగుపెట్టి,  జగన్ సమక్షంలో వైసీపీలో చేరి 2014, 2019లలో వరుసగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి శాసన సభ్యుడిగా ఎన్నికయ్యారు. రామకృష్ణా రెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇంతకీ, రాజకీయ నాయకుడిగా  ఆళ్ల రామకృష్ణారెడ్డి గ్రాఫ్ ఎలా ఉంది ?, ప్రజల్లో  ఆళ్ల రామకృష్ణారెడ్డి పై ఉన్న ప్రస్తుత అభిప్రాయం ఏమిటి ?, వచ్చే ఎన్నికల్లో  ఆళ్ల రామకృష్ణారెడ్డి  పరిస్థితేంటి ?, అసలు మళ్ళీ గెలిచి నిలిచే ఛాన్స్  ఆళ్ల రామకృష్ణారెడ్డి కి ఉందా ?, చూద్దాం రండి. 

 
ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సుదీర్ఘకాలం రాజకీయాల్లో లేకపోయినా..  రాజకీయాల్లో మాత్రం పట్టు సాధించారు. పైగా అన్ని పార్టీల నాయకులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.  రాజకీయాల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి వ్యక్తిగత విమర్శలకు చేయడానికి ఇష్టపడరు. ఐతే, 2019 ఎన్నికల్లో గెలిచినా తర్వాత జగన్ రెడ్డి మాయలో పడి.. విపరీతంగా నోరు పారేసుకున్నారు. దీనికితోడు, ఆంధ్ర రాజధాని అమరావతి తరలింపులో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఓ జోకర్ గా మారారు. ఒకవిధంగా రాజధాని ప్రాంతంలో ఎమేల్యేగా ఉండి, రాజధాని కోసం ఏ మాత్రం చిన్న మాట కూడా మాట్లాడలేని నాయకుడిగా ఆళ్ల రామకృష్ణారెడ్డి మిగిలిపోయారు.      
 
నిజానికి ఆళ్ల రామకృష్ణారెడ్డికు వ్యక్తిగతంగా మంచి పేరుతో పాటు బలమైన అభిమానగణం ఉంది. కానీ, అమరావతినే రాజధాని అని గట్టిగా చెప్పలేకపోవడంతో ఆయన సన్నిహితులే ఆయనకు దూరంగా జరిగారు. దాంతో ఆళ్ల రామకృష్ణారెడ్డిని అభిమానించే వారు కూడా,  ఇప్పుడు ఆయన పై కోపంగా ఉన్నారు. మరోవైపు ప్రజల్లో కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి పై తీవ్రమైన వ్యతిరేకత ఉంది. దీనికి ముఖ్య కారణం జగన్ రెడ్డే అని ఆళ్ల రామకృష్ణారెడ్డి బలంగా నమ్ముతున్నారు. అందుకే, ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జగన్ రెడ్డికి దూరంగా జరిగారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి పోటీ చేయడానికి కూడా ఇష్టపడడం లేదు. మొత్తమ్మీద ఆళ్ల రామకృష్ణారెడ్డికి రాజకీయ భవిష్యత్తు లేనట్టే.    
CLICK HERE!! For the aha Latest Updates