HomeTelugu Trendingత్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌!

త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్‌!

10 3యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ సినిమా వస్తోందంటే ఆయన అభిమానులకు ఎక్కడలేని సంతోషం, ఉత్సాహం వస్తుంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌తో కలిసి ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఆయన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇది వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తారక్‌ మరో చిత్రం చేసేందుకు పచ్చజెండా ఊపారా? అంటే టాలీవుడ్‌ వర్గాలు అవుననే అంటున్నాయి. ‘అరవింద సమేత’ తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందించిన దర్శకుడు త్రివిక్రమ్‌. జక్కన్న తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ నటిస్తారని చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే, ‘కేజీఎఫ్‌’ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌తో పాటు కొరటాల శివ కూడా తారక్‌కు కథ చెప్పారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సారథ్యంలో తారక్‌ ఓ సినిమా చేస్తారని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే, అది ఎవరి దర్శకత్వంలో చేస్తారో తెలియాల్సి ఉంది. కాగా, త్రివిక్రమ్‌ చెప్పిన లైన్‌ తారక్‌ నచ్చిందట. దీంతో మాటల మాంత్రికుడితోనే ఆయన సినిమా చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు అయితే, దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్‌ను ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ కు సంబంధించిన అన్ని బాధ్యతలను పూర్తి చేసుకోని రావాలంటే వచ్చే ఏడాది జులై వరకు వేచి చూడక తప్పదు. మరి ఈలోపు ఎన్టీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu