HomeTelugu Trending'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ అప్పుడేనా!

‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ అప్పుడేనా!

4 1సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ‘మహర్షి’ తరువాత చేస్తున్న సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఈ మూవీ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలు అవుతుంది అనే దానిపై నిన్నటి వరకు క్లారిటీ లేదు. కాగా, ఈరోజు ఈ సినిమాకు సంబంధించిన క్లారిటీని ఇచ్చారు.

జులై 7 వ తేదీన కాశ్మీర్ లో షూటింగ్ ప్రారంభం అవుతుందట. యూనిట్ మొత్తం మరో రెండు మూడు రోజుల్లో కాశ్మీర్ బయలుదేరి వెళ్ళబోతున్నారు. ఈ మూవీకి సినిమాటోగ్రాఫర్ ఎవరు అన్నది రేపు ప్రకటించనున్నారు. రత్నవేలు లేదంటే మోహనన్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఫైనల్ గా ఇద్దరిలో ఎవర్ని తీసుకుంటారన్నది సస్పెన్స్.

Recent Articles English

Gallery

Recent Articles Telugu