HomeTelugu Trendingబన్నీ సినిమా వదిలేసి.. మహేష్‌ సినిమాలో నటిస్తున్నాడు!

బన్నీ సినిమా వదిలేసి.. మహేష్‌ సినిమాలో నటిస్తున్నాడు!

5 29స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో సినిమా తెరకెక్కతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో వేగంగా జరుగుతున్నది. త్రివిక్రమ్ సినిమాల్లో రావు రమేష్ తప్పకుండా ఉంటాడు. ఈ సినిమాలో కూడా మొదట రావు రమేష్ ను తీసుకున్నారు. కానీ, ఎందుకో రావు రమేష్ స్థానాన్ని హర్షవర్ధన్ తో ఫిల్ చేశారు.

రావు రమేష్ ను ఎందుకు పక్కన పెట్టారు అనే దానిపై అనేక రూమర్లు వస్తున్నాయి. వీటికి చెక్ పెడుతూ.. కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. రావు రమేష్ మొదట బన్నీ సినిమా కోసం రెండు నెలల కాల్షీట్స్ ఇచ్చారట. అనుకోని విధంగా షూటింగ్ ఆలస్యం కావడంతో ఇచ్చిన డేట్స్ లో చాలా వెస్ట్ అయ్యాయి. ఇప్పుడు మరలా సర్దుబాటు చేయాలి అంటే కష్టంతో కూడుకొని ఉన్నదట. కొన్ని రోజులు అడ్జెస్ట్ అవుతాయి కానీ, పూర్తిగా సర్దుబాటు చేయడం కుదరకపోవడంతో రావు రమేష్ ప్లేస్ లో అమృతం ఫేమ్ హర్షవర్ధన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. బన్నీ సినిమాతో పాటు అటు మహేష్ సినిమాలో కూడా రావు రమేష్ నటిస్తుండంతో డేట్స్ సర్దుబాటు చేయలేకపోయారట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!