మిల్కీ బ్యూటీ అంటే తనకు ఇష్టం లేదంట!

హీరోయిన్‌ తమన్నాను అందరు ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుస్తుంటారు. ముట్టుకుంటే కందిపోయే అంతటి అందం ఆమెది. అందుకే అలా పిలుస్తుంటారు. ఇలా పిలిపించుకోవడం తమన్నాకు ఇష్టం లేదట. మీడియాలో అందరు తనను మిల్కీ బ్యూటీ అని పిలుస్తూ రాస్తున్నారని.. అలా పిలిస్తే తనకు ఇష్టం లేదని చెప్తున్నది. సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ అవసరమే.. స్కిన్ అందానికి ప్రాధాన్యత ఇవ్వడం ఇష్టం లేదని చెప్తున్నది.

ఇండస్ట్రీలో గ్లామర్ అన్నది కొంతవరకు మాత్రమే పనికొస్తుంది. టాలెంట్ ఉంటెనే మనుగడ సాధించగలం. ఈ విషయాన్ని అందరు దృష్టిలో పెట్టుకోవాలని అంటోంది తమన్నా. ఇప్పుడు గ్లామర్ తో సంబంధం లేకుండా చాలామంది ఇండస్ట్రీలోకి వస్తున్నారని.. టాలెంట్ ఉన్నవాళ్లు ఎందరో రాణిస్తున్నారని ఈ మిల్కీ బ్యూటీ అంటూంది.