
Vijay Deverakonda Oke Oka Jeevitham:
Vijay Deverakonda చాలా బిజీగా ఉన్న హీరోలలో ఒకరు. అయితే ఆయన తాజా సినిమా ‘కింగ్‌డమ్’ మాత్రం ఒక చిన్న బ్రేక్ తీసుకుంది. మొదట 2025 జూన్‌లో విడుదల చేయాలనుకున్నారు కానీ ఇప్పుడు జూలై 4, 2025కి పోస్ట్‌పోన్ చేశారు. ఈ సినిమా ఓ స్పై యాక్షన్ థ్రిల్లర్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్నారు. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇదిలా ఉంటే, విజయ్ తాజాగా సినిమా వికటన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ఆసక్తికర విషయం చెప్పాడు. ఆయన ఒకప్పుడు చేయాలనుకుని మిస్ అయిన సినిమా గురించి మాట్లాడాడు. అది మరెవ్వో కాదు, ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో కనం). ఈ సినిమా 2022లో విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. విజయ్ ఈ కథను మూడుసార్లు విన్నాడట. స్క్రిప్ట్ అంటే నిజంగా ఇష్టపడాడట. యాక్ట్ చేయాలని, ప్రొడ్యూస్ కూడా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ “నాకు ఇది సెటవ్వదనిపించింది” అని చెప్పాడు. ఆ తర్వాత నిర్మాతగా వ్యవహరించాలనుకున్నా, అదే సమయంలో నిర్మాత ఎస్.ఆర్.ప్రభు ముందుకొచ్చి “నేనే చేస్తా” అన్నాడట.
ఒకే ఒక జీవితం విడుదలైన సమయానికి విజయ్ చేసిన ‘లైగర్’ మాత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్రంగా ఫెయిల్ అయింది. ఈ విషయం ఒక విధంగా ఆయనకు ఫీలవ్వక తప్పదు. కాని విజయ్ మనసు పెట్టిన కథ విజయం సాధించటం ఆనందమే.
ఇక ముందుకి చూస్తే, విజయ్ చేతిలో భారీ లైనప్ ఉంది. రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్‌లో ఒక సినిమా, రవి కిరణ్ కోలాతో ‘రౌడి జనార్దన్’ అనే మరో ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. అంతేకాదు, ఇప్పుడే ‘కింగ్‌డమ్’ సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారట.
విజయ్ కెరీర్ మళ్లీ బౌన్స్‌బ్యాక్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.













