పగటి పూట ఆడపిల్ల.. రాత్రి పూట పాము

తెలుగులో “నాగకన్య” పేరుతో విడుదలకు సిద్ధమైన తమిళ చిత్రం “నీయా2”. ఈ చిత్రంలో జై, వరలక్ష్మి శరత్‌కుమార్‌, రాయ్‌ లక్ష్మి, కేథరిన్‌ కీలక పాత్రల్లో నటించారు. ఎల్‌ సురేష్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మే24న ప్రేక్షకుల ముందుకు రానుంది. “పగటి పూట ఆడపిల్లగానూ, రాత్రి పూట పాముగానూ బ్రతకడం నా వల్ల కావడం లేదు” అంటూ వినిపిస్తున్న డైలాగ్స్‌ ఆసక్తికరంగా ఉన్నాయి. ఇందులో వరలక్ష్మి, రాయ్‌లక్ష్మి, కేథరిన్‌లలో ఎవరు అసలు నాగకన్య అనే విషయం తెలియదు. షబ్బీర్‌ సంగీతం అందించిన ఈ సినిమా ఎ.శ్రీధర్‌ సమర్పణలో జంబో సినిమా పతాకంపై రూపొందించారు.