HomeOTTఈటీవీ విన్ వేదికగా వచ్చిన Wife Off ఎలా ఉందంటే!

ఈటీవీ విన్ వేదికగా వచ్చిన Wife Off ఎలా ఉందంటే!

Wife Off Review: A Thriller That Missed Its Mark?
Wife Off Review: A Thriller That Missed Its Mark?

Wife Off review:

Wife Off అనే సినిమా ఈటీవీ విన్ ఓటిటి వేదికగా రిలీజ్ అయ్యింది. ఈ మధ్య చిన్న సినిమాలు ఎక్కువగా డైరెక్ట్ ఓటిటి రీలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఈ సినిమా మీదా కొంచెం ఆసక్తి నెలకొంది. అయితే, ట్రైలర్ చూసి అంచనాలు పెంచుకున్న వాళ్లకు ఈ సినిమా నచ్చుతుందా లేదా చూద్దామా..

కథ:

అవని (దివ్య శ్రీ) అనే అమ్మాయి నటిగా ఎదగాలని కలలు కంటూ ఓ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ అభి (అభినవ్ మాణికంఠ)ని ప్రేమిస్తుంది. కానీ ఊహించని పరిస్థితుల్లో తన బంధువైన వ్యక్తితో (నిఖిల్ గాజుల) పెళ్లి అవుతుంది. పెళ్లి తర్వాత ఆమె జీవితంలో హింసే మిగులుతుంది. ఒక రోజు భర్త అనుమానాస్పదంగా చనిపోతాడు. ఆ హత్యేనా లేక ఆత్మహత్యా? అవని పాత్రపై వచ్చిన ఆరోపణలు నిజమేనా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

దివ్య శ్రీ పాత్రకు తగ్గట్టుగా బాగా నటించింది. ఆమె హావభావాలు కథలో బాగా నప్పాయి. అభినవ్ మాణికంఠ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో న్యాయం చేశాడు. నిఖిల్ గాజుల తన నెగటివ్ రోల్‌లో ఓకే అనిపించాడు. సాయి స్వేత తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ, ఓకే అనిపిస్తుంది.

సాంకేతిక అంశాలు:

దర్శకుడు భాను యరుబండి సస్పెన్స్ సృష్టించడంలో కొంతవరకు విజయవంతమయ్యాడు. కానీ కథనంలో బలం లేకపోవడంతో ఆసక్తి మధ్యలో తగ్గిపోయింది. ఎడిటింగ్ మరింత పకడ్బందీగా ఉండి ఉంటే బాగుండేది. సౌండ్ డిజైన్ పూర్తిగా నిరాశపరిచింది. సినిమాటోగ్రఫీ పరంగా సినిమాకు పెద్దగా హెల్ప్ కాలేదు.

ప్లస్ పాయింట్స్:

*దివ్య శ్రీ, అభినవ్ మాణికంఠ నటన
*కొన్ని సస్పెన్స్ మోమెంట్స్
*పాత్రల అర్క్ బాగుండడం

మైనస్ పాయింట్స్

-పాత కథ
-థ్రిల్లర్ అనిపించకపోవడం
-క్లైమాక్స్
-సౌండ్, ఎడిటింగ్ పరంగా ఇంప్రూవ్ అవ్వలేకపోవడం

తీర్పు:

మొత్తానికి, “వైఫ్ ఆఫ్” ఓ యావరేజ్ థ్రిల్లర్. దివ్య శ్రీ, అభినవ్ నటన బాగున్నా, కథ, కథనాలు ఆకట్టుకోకపోవడం సినిమాను వెనక్కి లాగాయి. టైం ఉంటే ఒకసారి సినిమాను చూడచ్చు..

రేటింగ్: 2/5

ALSO READ: రిపోర్ట్స్ ప్రకారం హైదరాబాద్‌లో Top 5 News Channels ఇవే!

Recent Articles English

Gallery

Recent Articles Telugu