టర్కీకు పయనమవుతున్న మెగాహీరో!

మెగామేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా గోపిచంద్ మలినేని ‘విన్నర్’ అనే చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా ఓ వ్యక్తి తనకు ఎదురైన సమస్యలను ఎలా అధిగమించి ‘విన్నర్’గా నిలిచాడనే కథాంశంతో తెరకెక్కిస్తున్నారు.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కొన్ని పాటలను ఉక్రెయిన్ లో చిత్రీకరించారు. ఇప్పుడు చిత్రబృందం ఉక్రెయిన్ నుండి టర్కీకు బయలుదేరుతుంది. ఈ విషయాన్ని స్వయంగా సాయి ధరం తేజ్ వెల్లడించారు. అక్కడ కూడా ఒకటి, రెండు పాటలను చిత్రీకరించనున్నారు.

గతంలో చాలా సినిమాల షూటింగ్స్ టర్కీలో జరిగాయి. దీంతో కొత్త లొకేషన్స్ లో పాటలను చిత్రీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి చివరి వారంలో విడుదల చేయనున్నట్లు సమాచారం. సాయి ధరం తేజ్ నటించిన తిక్క సినిమా ఫ్లాప్ కావడంతో ఈ సినిమాతో ఎలా అయినా.. సక్సెస్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు.