HomeTelugu Newsబెజవాడలో నయా ట్రెండ్.. మహిళల పేకాట అడ్డా..!

బెజవాడలో నయా ట్రెండ్.. మహిళల పేకాట అడ్డా..!

7 21సాధారణంగా పేకాట జూదానికి బానిసలై కుటుంబాలను లెక్కచేయకుండా సర్వం కోల్పోయిన పురుషులను చాలామంది చూసే ఉంటారు. కానీ మేం మాత్రం తక్కువేమీ కాదు అనే స్థాయిలో మహిళలు పేకాడుతూ నయా ట్రెండ్‌ నడిపిస్తున్నట్లు బెజవాడ పోలీసులు కనిపెట్టారు. అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో మాత్రమే మహిళలు పేకాట ఆడడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ ఏపీ నడిబొడ్డున రాజధాని అమరావతిలోనూ మహిళలు పేకాట ఆడుతున్నారు. అవును ఇది పచ్చి నిజం..! ఇప్పుడు ఇదో ట్రెండ్‌గా మారింది. తాడేపల్లి పట్టణం రామ్ హాస్పిటల్ సమీపంలో ఉన్న పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. ఓ ఇంట్లో రహస్యంగా కొందరు మహిళలు పేకాట ఆడుతూ కనిపించడంతో పోలీసులే షాక్ తిన్నారట.

ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న 8 మంది మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.1,36,000 (లక్షా 36వేలు) నగదుతో పాటు 8 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి మరో ముగ్గురు వ్యక్తులు పరారయ్యారట. పట్టుబడిన మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ఐతే ఏపీ రాజధాని ప్రాంతంలో మహిళలు పేకాట ఆడుతూ పోలీసులకు చిక్కడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu