HomeTelugu Trendingసైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

సైంధవ్‌ ఫస్ట్‌ సింగిల్‌ అప్డేట్‌

Wrong Usage Lyrical Video f
విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సైంధవ్‌. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. లేటెస్ట్ థ్రిల్లింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సైంధవ్. ఈ మూవీలో రుహానీ శర్మ, బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ, కోలీవుడ్‌ యాక్టర్ ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయినపల్లి గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీని శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఇక నేడు సైంధవ్ నుండి రాంగ్ యూసేజ్ అనే ఫస్ట్ సాంగ్ ని కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ లోని ఈవెంట్స్ లో భాగంగా విడుదల చేశారు. ఇక ఈ డ్యాన్సింగ్ నెంబర్ ని నకాష్ అజీజ్ అద్భుతంగా ఆలపించారు.
చంద్రబోస్ ఎంతో ఆకట్టుకునే లిరిక్స్ ని అందించారు. మొత్తంగా యువతతో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ప్రస్తుతం రాంగ్ యూసేజ్ సాంగ్ ఎంతో ఆకట్టుకుంటూ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో కొనసాగుతోంది. కాగా సైంధవ్ మూవీ 2024 సంక్రాంతి కానుకగా జనవరి 13న పలు భాషల ప్రేకకుల ముందుకి రానుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu