HomeTelugu Trending'సైంధవ్‌' మూవీ ట్రైలర్‌

‘సైంధవ్‌’ మూవీ ట్రైలర్‌

Saindhav movie Trailer
వెంకటేశ్ హీరోగా శైలేశ్ కొలను డైరెక్షన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సైంధవ్’. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. వెంకట్ బోయినపల్లి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ ఈ రోజు విడుదలైంది.

ఈ కథ తండ్రీ కూతుళ్ల మధ్య గల ఎమోషన్స్ నేపథ్యంలో నడుస్తుందనే విషయం అర్థమవుతోంది. హీరో కూతురు నరాలకు సంబంధించిన ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంటుంది. అందుకు అవసరమైన ఇంజక్షన్ ఖరీదు 17 కోట్లు. ఆ పాప మాత్రం తన కోసం తండ్రి ఏదైనా చేయగలడు .. తన తండ్రి ఉండగా తనకేం కాదు అనే నమ్మకంతో ఉంటుంది.

ఆ ఇంజక్షన్ హీరోకి దొరక్కుండా కొంతమంది స్వార్థపరులు అడ్డుకుంటూ ఉంటారు. అప్పుడు హీరో ఏం చేశాడనే అంశం చుట్టూ ఈ కథ నడుస్తూ ఉంటుంది. ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ వెంకటేష్‌కు జంటగా నటించగా.. ఆర్య, ముఖేశ్ రుషి, నవాజుద్దీన్ సిద్ధికీ, జిషు సేన్ గుప్తా, రుహాని శర్మ, ఆండ్రియా ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu