ఏడాదికి మూడు సినిమాలు చేస్తానంటోన్న బ్యూటీ!

శ్రీమంతుడు సినిమా తరువాత ఇక ప్రేమమ్ సినిమాలో తప్ప శృతిహాసన్ మరే సినిమాలో
కనిపించలేదు. రెండేళ్లకు గాను కేవలం రెండు సినిమాలు చేయడం పట్ల ఆమె కావాలని
తెలుగు సినిమాలు తగ్గించిందా..? లేక ఆమెను ఎవరు నటించమని అడగట్లేదా..? అనే
ప్రశ్నలు మొదలయ్యాయి. వీటిపై శృతి స్పందించింది. ఇతర బాషల్లో సినిమా అవకాశాలు
ఎక్కువగా రావడం వలనే తెలుగు సినిమాలు తగ్గించానని చెబుతోంది. నా అభిమాన
ప్రేక్షకులు తెలుగు వారే అంటూ ఎక్కువ విజయాలు ఇక్కడే దక్కాయని తెలిపింది. పవన్
కల్యాణ్ తో కలిసి నటిస్తోన్న ‘కాటమరాయుడు’ చిత్రంతో తెలుగు వారికి మరింత దగ్గరవుతానని
చెప్పుకొచ్చింది. అలానే ఇకపై ఏడాదికి మూడు తెలుగు సినిమాలు చేసేలా జాగ్రత్త
పడతానని తన అభిమానులకు మాటిచ్చింది.