HomeTelugu Trendingబీర్‌ తాగడమంటే చాలా ఇష్టం.. నటి షాకింగ్‌ కామెంట్స్‌

బీర్‌ తాగడమంటే చాలా ఇష్టం.. నటి షాకింగ్‌ కామెంట్స్‌

12 2
మాలీవుడ్‌ నటి వీణా నందకుమార్‌ అనే నటి బీర్‌ తాగడమంటే తనకి ఎంతగానో ఇష్టమంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. బీర్‌ తాగడాన్ని తాను ఎంజాయ్‌ చేస్తానని ఆమె పేర్కొన్నారు. దీంతో వీణ గురించి సోషల్‌ మీడియా విపరీతంగా ట్రోల్స్‌ వచ్చాయి. ఇటీవల ఆమె ఓ స్థానిక పత్రికతో ముచ్చటిస్తూ.. ‘బీర్‌ అంటే ఇష్టమని చెప్పడానికి నేనెందుకు భయపడాలి. అది ఏమైనా పెద్ద నేరమా? బీర్‌ తాగినప్పుడు చాలా ఎక్కువగా మాట్లాడతాను. ఈ విషయాన్ని నేను ఒకానొక సమయంలో ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. చాలామంది యువతీయువకులకు కూడా బీర్‌ తాగడం ఒక అలవాటుగా ఉంటుంది. బీర్‌ తాగడం అనేది వారి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.’ అని వీణ తెలిపారు.

ఇదిలా ఉండగా పలువురు నెటిజన్లు వీణ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సోషల్‌ మీడియా వేదికగా వీణ గురించి విపరీతంగా ట్రోల్స్‌ చేశారు. దీంతో ట్రోల్స్‌పై ఆమె స్పందిస్తూ.. ‘నా స్టేట్‌మెంట్స్‌ను చాలామంది అపార్థం చేసుకుని నన్ను విపరీతంగా ట్రోల్స్‌ చేస్తున్నారు. తాము చేసే ట్రోల్స్‌ గురించి నెటిజన్లు ఒకసారి రివ్యూ చేసుకోవాలి’ అని అన్నారు. అనంతరం ఆమె తాను ఎలాంటి పాత్రల్లోనైనా నటించడానికైనా సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ‘నటన విషయంలో నేను ఎలాంటి నిబంధనలు పెట్టుకోలేదు. మంచి కథతో కూడిన గ్లామరస్‌ పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తా. ఇలాంటి పాత్రల్లోనే నటించాలని నిబంధనలు పెట్టుకోలేదు. నటీనటులు ఓపెన్‌ మైండెడ్‌గా ఉండాలని నేను నమ్ముతున్నాను. ఒక మంచి పాత్ర, మంచి కథ కోసం నేను ఎదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను.’ అని వీణ పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!