నితిన్ ఇంటర్వ్యూ స్పెషల్!

‘అ ఆ’ చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకున్న నితిన్ ఇప్పుడు ‘లై’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. హను రాఘవపుడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సంధర్భంగా నితిన్ తో కాసిన్ని ముచ్చట్లు..
కొత్త కథ..
‘లై’ చాలా డిఫరెంట్ గా కొత్తగా ఉంటుంది. హను ‘అందాల రాక్షసి’,’కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ వంటి మంచి లవ్ స్టోరీస్ ను సినిమాలుగా చేసాడు. ఈ సినిమా చూసిన తరువాత తనే ఈ సినిమా చేశాడా…? అని అనుమానం కలుగుతుంది. సినిమాకు హాలీవుడ్ లుక్ తీసుకురావాలని ప్రయత్నించాడు.

హీరో, విలన్ ఫైటింగ్ థ్రిల్లింగ్ గా..
ఈ సినిమా మంచి లవ్ స్టోరీ. హీరో, విలన్ మధ్య శతృత్వం కొత్తగా ప్రెజంట్ చేశారు. ఇంటెలిజెంట్ స్క్రీన్ ప్లే తో నడిపించారు. హీరో విలన్ మధ్య ఫైటింగ్ థ్రిల్లింగ్ గా ఉంటుంది.

త్రివిక్రమ్ గారి సలహా తీసుకొని చేశా..
అసలు ‘అ ఆ’ తరువాత ఎలాంటి సినిమా చేయాలో తెలియక కన్ఫ్యూషన్ లో ఉండిపోయాను. ఇక అప్పుడు త్రివిక్రమ్ గారికి ఫోన్ చేసి నా పరిస్థితి వివరించాను. అప్పుడు ఆయన సాఫ్ట్ సినిమా చేయకుండా, డిఫరెంట్ గా ఉండే కొత్త సినిమా సినిమా చేయమన్నారు. అదే సమయంలో హను చెప్పిన లైన్ నన్ను బాగా ఎగ్జైట్ చేసింది. వెంటనే ఓకే చెప్పేశాను.

అర్జున్ గారు లేకపోతే సినిమా లేదు..
ఆయన లేకుంటే ఈ సినిమా ఇలా వచ్చేది కాదు. ఆయన వలనే సినిమాకు ఫ్రెష్ లుక్ వచ్చింది. ఈ మధ్య కాలంలో వచ్చిన స్టైలిష్డ్ విలన్ గా ఆయనకు మంచి పేరు వస్తుంది.

ఆవారాగా తిరిగే అబ్బాయి పాత్రలో..
ఆవారాగా తిరిగేవాడు అమెరికా వెళ్ళి డబ్బున్న తెల్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకునే క్యారెక్టర్ లో కనిపిస్తాను. అక్కడ అతనికి ఎదురయ్యే సమస్యలతో నడిచే కథే ఇది.

నా సినిమాల్లో పవన్ ఎప్పటికీ కనిపిస్తారు..
నా ప్రేమను పవన్ కల్యాణ్ గారి పట్ల చూపించడానికి నా సినిమాల్లో ఫోటో రూపంలో, పేరు రూపంలో ఆయన టాపిక్
తీసుకొస్తుంటాను. ‘ఇష్క్’ సినిమాకు ముందు వరకు నేను ఆయనను వాడుకుంటున్నానని అన్నారు. కానీ అది నా ప్రేమ. లైఫ్ లాంగ్ నా సినిమాలో ఏదొక రూపంలో ఆయన పేరు వినిపిస్తుంది అంతే..