Homeతెలుగు Newsకేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు: జగన్

కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదు: జగన్

13a

కేంద్రంలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాదని, హంగ్‌ ఏర్పడే అవకాశాలున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని… ప్రత్యేక హోదా ఫైల్‌పై సంతకం పెట్టిన పార్టీకి మాత్రమే మద్దతిస్తామని స్పష్టం చేశారు. లోటస్‌పాండ్‌లో ఆయన గురువారం తటస్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ పార్టీ విధివిధానాల గురించి వారికి వివరించారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా హంగ్‌ వస్తేనే మంచిదని వైఎస్‌ జగన్‌ అభిప్రాయపడ్డారు. 25 ఎంపీ స్థానాలను ప్రజలు వైఎస్సార్‌ సీపీకే కట్టబెడతారని.. తద్వారా కేంద్రం మెడలు వంచి హోదా సాధిస్తామని పేర్కొన్నారు.

రైల్వేజోన్‌ అంశంపై తనకు పూర్తి అవగాహన ఉందని వైఎస్‌ జగన్‌ అన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలకు రైల్వేజోన్‌ ఉందని.. చట్టప్రకారం విశాఖకు రైల్వే జోన్‌ రావాలన్నారు. రైల్వే జోన్‌ కోసం వైఎస్సార్‌ సీపీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా, రైల్వేజోన్‌, కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం అలుపెరుగని కృషి​ చేస్తామని పేర్కొన్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu