HomeTelugu Trendingహీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వైఎస్ షర్మిల కొడుకు!

హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న వైఎస్ షర్మిల కొడుకు!

ys sharmila son enter in to
వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల కుమారుడు రాజారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు తన తల్లితో పాటు ఇడుపులపాయకు వచ్చిన రాజారెడ్డి అందరి దృష్టినీ ఆకర్షించాడు. మంచి హైట్, కండలు తిరిగిన శరీరంతో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇప్పుడు షర్మిల కొడుకు రాజారెడ్డిని సినిమా రంగంలోకి తీసుకొస్తున్నట్లు చెప్తున్నారు. ఇప్పటికే తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అయితే తొలి చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించబోతున్నారని అంటున్నారు. ఈ చిత్రం యాక్షన్ ఓరియెంటెడ్ ఫ్యామిలీ డ్రామా అని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!