ఈసారైనా హిట్ కొడతాడా..?

కెరీర్ ప్రారంభం నుంచీ …వినూత్నమైన కథలు, వెరైటీ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో సందీప్ కిషన్. ఇటు తెలుగుతో పాటు.. అటు తమిళంలోనూ రాణిస్తున్నాడు కానీ సరైన హిట్ పడటం లేదు. రెండు భాషల్లో ఒకేసారి సినిమాలు చేస్తూ స్టార్ డమ్ కోసం ప్రయత్నిస్తున్న ఈ యుననటుడు నటనకి మంచి మార్కులే పడుతున్నాయి.
అయితే ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ తరవాత అంతటి సక్సెస్ దక్కలేదు. లాస్ట్ ఇయిర్ వచ్చిన ‘నగరం’, ‘నక్షత్రం’, ‘శమంతకమణి’, ‘కేరాఫ్ సూర్య’ , ‘ప్రాజెక్ట్ జెడ్’సినిమాలు ఏవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దీంతో ఇప్పుడు ఓ తమిళ రీమేక్ తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించడానికి రెడీ అయిపోయాడు.ప్రస్తుతం కార్తీక్ నరేన్ దర్శకత్వంలో ‘నరగసూరన్’ అనే సినిమాలో నటిస్తున్న ఈయన తమిళ చిత్రం ‘ఇండ్రు నెట్రు నాలై’ ను తెలుగులోకి రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట. సైన్స్ ఫిక్షన్ కామెడీ జానర్లో ఉండే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఈ రీమేక్ ను చేయాలని భావిస్తున్నారట సందీప్. అన్నీ కుదిరితే ఈ రీమేక్ ను నూతన దర్శకుడు శ్రీరామ్ డైరెక్ట్ చేసే అవకాశాలున్నాయి. అయితే ఈ విషయమై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.