తప్పుడు వార్తలు నమ్మొద్దు: నాగార్జున


అన్న‌పూర్ణ స్డూడియో ఈ రోజు షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న స్టూడిమోలో అగ్ని ప్ర‌మాదం జ‌రిగింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. దీంతో పాటు అనేక ప్ర‌చారాలు కూడా జ‌రిగాయి. ఈ నేప‌థ్యంలో అన్న‌పూర్ణ స్డూడియో నిర్వాహ‌కులు త‌మ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ లో అంతా బాగానే ఉంది. మేం ధృవీక‌రించని వార్తలు ఎవరు నమ్మొద్దని తమ సోషల్ మీడియా ద్వారా విన్నవించారు నిర్వాహ‌కులు. అయితే సినిమా షూటింగ్ కోసం వేసిన సెట్‌లో షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాదవశాత్తు ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్ర‌మాదంలో ప్రాణ న‌ష్టం, ఆస్తి న‌ష్టం జ‌ర‌గ‌లేదు. అంతే కాక బిగ్‌బాస్ షోకు సంబంధించిన సెట్‌ కూడా అన్న‌పూర్ణ స్టూడియోలో నిర్మించిన విష‌యం తెలిసిందే.

తరుణ్ భాస్కర్‌తో క్లాప్‌బోర్డు ఇంటర్యూhttps://www.klapboardpost.com/director-tharun-bhascker-exclusive-interview-with-klapboard/

CLICK HERE!! For the aha Latest Updates