ఎంపీ కవిత ఛాలెంజ్‌ను స్వీకరించిన రాజమౌళి

తెలంగాణ ఎంపీ కల్వకుంట కవిత పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలు నాటాలని ‘హరితహారం’ పేరుతో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రియాంక చేసిన ఛాలెంజ్‌ను ఆమె స్వీకరిస్తూ మొక్కలు నాటారు. సైనా నెహ్వాల్‌, ఎస్‌.ఎస్‌. రాజమౌళి తదితరులకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు. మొక్కను నాటమని, ఉత్తమ ప్రపంచం కోసం పచ్చదనాన్ని వ్యాప్తి చేయమని కోరారు. ‘హరితహారం’ కార్యక్రమంలో భాగంగా, మొక్కల ఆవశ్యకతను తెలుపుతూ.. కవిత చేసిన ఛాలెంజ్‌ ను రాజమౌళి స్వీకరించారు.

‘ఛాలెంజ్‌ స్వీకరించా కవిత గారు. మర్రి చెట్టు గుల్మొహర్‌, వేప మొక్కలను నాటాను. ఇప్పుడు పుల్లెల గోపీచంద్‌, కేటీఆర్‌, సందీప్‌రెడ్డి వంగా, నాగ్‌ అశ్విన్‌లను ఈ హరితహారం ఛాలెంజ్‌కు నామినేట్‌ చేస్తున్న’ అని జక్కన్న ట్వీట్‌ చేశారు. దీంతోపాటు మొక్క నాటుతుండగా తీసిన ఫొటోను పంచుకున్నారు. అయితే రాజమౌళి స్పందన చూసిన కవిత రాజమౌళికి ధన్యవాదాలు తెలుపుతూ.. ట్వీటర్‌ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సైనా నెహ్యాల్‌ కూడా కవిత ‘హరితహారం’ సవాలు స్వీకరించారు. మొక్కటు నాటుతు దిగన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. తాప్సి, శ్రద్దా కపూర్‌, ఈషా గుప్తాలను పై ఈ సవాల్‌ విసిరారు.