కొణిదల ప్రొడక్షన్స్ లో సుక్కు!

టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ‘రంగస్థలం’. ఇప్పటికే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సాంగ్స్ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాయి.ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తవడంతో రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే మూవీ కోసం ఎన్టీఆర్ తో కలిసి లాస్ ఏంజెలెస్ కి చెక్కేసాడు రామ్ చరణ్. ఆ తర్వాత రంగస్థలం సినిమా ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టబోతున్నాడు. తాజాగా మెగాకాంపౌండ్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం.. సుక్కుకు తన ప్రొడక్షన్ బ్యానర్ అయిన కొణిదెల ప్రొడక్షన్స్ తరపున మరో సినిమా చెసే అవకాశం ఇచ్చాడట చరణ్. దీనిలో భాగంగానే కొణిదెల బ్యానర్ నుంచి కొంత మొత్తం అడ్వాన్స్ సుకుమార్ చేతికి అందినట్టు టాక్. అన్నీ బాగా కుదిరితే సుకుమార్ దర్శకత్వంలో చిరంజీవితో ఓ సినిమా చేయించడానికి రామ్ చరణ్ ప్లాన్ చేస్తున్నాడని ఇంటర్నల్ సమాచారం. మొత్తానికి రంగస్థలం అనే సింగిల్ సినిమాతో మెగా కాపౌండ్ లో అడుగు పెట్టిన సుకుమార్ కి లక్ కలిసొచ్చిందనే చెప్పాలి.