విడుదలకు సిద్ధంగా ‘అండర్ వరల్డ్ బ్లడ్ వార్స్’!

కేట్ బెసికిన్సల్ ప్రధాన పాత్రలో అనా ఫోర్స్టెర్ రూపొందిస్తున్న హారర్ యాక్షన్ డ్రామా ‘అండర్ వరల్డ్ బ్లడ్ వార్స్’. ఈ సినిమా డిసంబర్ 2న విడుదలకు సిద్ధంగా ఉంది. డైరెక్టర్ గా అనా కు ఇది మొదటి సినిమా. తనకు నటీనటులు ఎంతగానో సహకరించారని… సెలీన్ అనే పాత్రలో కేట్ అధ్బుతమైన నటనను కనబరిచిందని ఆమె పేర్కొన్నారు. డైరెక్టర్ గా కేట్ తో కలిసి పని చేయడం ఎప్పటికీ మర్చిపోలేనని.. ఇప్పటివరకు నేను పని చేసిన వారందరిలో కేట్ కు ప్రత్యేకమైన స్థానం ఉందని తెలిపారు. 3డి లో రూపొందిన ఈ సినిమా డిసంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళం వంటి బాషల్లో సోని పిక్చర్స్ ఎంటర్ టైన్మెంట్ వారి ఆధ్వర్యంలో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. అన్ని చోట్ల నుండి ట్రైలర్ కు మంచి స్పందన లభిస్తోంది.