గెడ్డంతో మహేష్‌

మహేష్‌ బాబు తన 25వ చిత్రం లో కొత్త లుక్‌లో కనిపించాలని నిర్ణయించుకున్నాడు. దీని కోసం అతడు ప్రత్యేకంగా తన బాడీని మార్చుకుంటున్నాడు.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అతడు మూవీ చేయనున్నాడు.. దిల్‌రాజు, అశ్వనీదత్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెరికా నేపథ్యంలో ఈ మూవీ కథ ఉంటుందని టాక్‌.. అందుకే 70 శాతం షూటింగ్‌ అమెరికాలో చేయనున్నారు. ఇక వచ్చే వారం నుంచి డెహ్రడూన్‌లో తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది..మహేష్‌ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నది.

గెడ్డంతో మహేష్‌ : కొత్త లుక్ అదిరిపోయింది

ఇక కొత్త లుక్‌ కోసం మహేష్‌ గడ్డాన్ని పెంచుతున్నాడు.. ఇటీవల తారక్‌, రామ్‌ చరణ్‌లు గడ్డంతోనే మూవీలలో నటించారు.. అదే దారిలో ఇప్పుడు మహేష్‌ పయనిస్తున్నాడు.. ఈ గడ్డం పెంచిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.. సాధారణంగానే అందంగా కనిపించే మహేష్‌, ఈ తాజా చిత్రంలో మరింత క్యూట్‌గా కనిపిస్తున్నాడు. మహేష్‌ రోడ్డుపై నడుస్తూ వెళ్తుంటే తీసిన వీడియో ఎక్కడిదన్న విషయం తెలియరాలేదు.