‘గ్యాంగ్‌ లీడర్‌’ రీమేక్‌ ఆలోచనలో చరణ్‌!

మెగాస్టార్‌ చిరంజీవి కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్స్ లో ఒకటిగా నిలిచిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’. ఈ సినిమాపై ప్రస్తుతం అతని కుమారుడైనా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ కన్ను పడింది. మాగంటి రవీంద్రనాథ్‌ చౌదరి నిర్మాణంలో విజయబాపినీడు దర్శకత్వంలో 1991లో ఈ సినిమాను తెరకెక్కించారు. బప్పీలహరి సంగీతం ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.

 

ఇప్పుడీ చిత్రాని రీమేక్‌ చేసే ఆలోచనలో రామ్‌ చరణ్‌ ఉన్నట్లు ఫిల్మ్‌ నగర్‌ లో టాక్‌.. క్రియేటీవ్‌ కమర్షియల్‌ బ్యానర్‌ పై కె ఎస్‌ రామారావు ఈ మూవీ నిర్మించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ రాజమౌళితో చేస్తున్న మల్లీస్టారర్‌ మూవీ తర్వాత ఈ మూవీ సెట్స్‌ పైకి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.