తేజ్‌ ‘చిత్రలహరి’ మూవీలో సునీల్‌!

‘సాయి ధరమ్ తేజ్’, కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంటర్ టైన్మెంట్ ప్రధానాంశంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ సునీల్ నటించనున్నాడని తెలుస్తోంది. కమెడియన్‌గా మంచి ఫాంలో ఉండగానే హీరోగా టర్న్‌ తీసుకున్న ‘సునీల్‌’ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. హీరోగా చేసిన సినిమాలన్నీ వరుగా బోల్తా పడటంతో తిరిగి కామెడీ రోల్స్‌పై దృష్టిపెట్టాడు సునీల్. ప్రస్తుతం అల్లరి నరేష్ తో కలిసి ‘సిల్లీఫెలోస్‌’ సినిమాలో నటిస్తున్న సునీల్‌, మరికొన్ని సినిమాలో క్యారెక్టర్‌ రోల్స్‌లో నటించేందుకు అంగీకరించాడు.

ఈ చిత్రాన్ని ఫ్యామిలీ ఎలెమెంట్స్, మంచి కథతో ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ ను సిద్ధం చేశారట కిషోర్‌ తిరుమల.ఈ చిత్రం పై వినిపిస్తున్న వార్తల ప్రకారం ‘చిత్రలహరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌’ అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో ఈ దర్శకుడు ‘నేను శైలజా’, ‘ఉన్నదీ ఒకటే జిందగీ’ సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది.