ముగ్గురు హీరోయిన్‌లతో నాని రొమాన్స్‌..!


నేచురల్ స్టార్ నానితో యంగ్‌ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సింగరాయ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రానికి ట్యాక్సీవాలా ఫేం దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్ ప్రారంభానికి చాలా సమయం ఉన్నా ఇప్పుడే హీరోయిన్‌ కోసం చర్చలు జరుగుతున్నాయట. ఈ సినిమాలో నాని సరసన ముగ్గురు హీరోయిన్లు రొమాన్స్ చేయబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాలో సాయిపల్లవి ఓ హీరోయిన్‌గా ఖరారు కాగా, మరో హీరోయిన్‌గా నటించేందుకు రష్మికను అడిగితే నో చెప్పిందట. తాజాగా మరో ఇద్దరు ముద్దుగుమ్మలతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. తమిళంలో విజయ్‌తో నటించిన మాళవిక, గూఢచారి చిత్రంలో నటించిన శోభిత ధూళిపాళ్లను ఓకే చేసినట్లు సమాచారం.

CLICK HERE!! For the aha Latest Updates